అమరావతి భూముల లావాదేవీలపై కేసు నమోదు చేసిన ఏసీబీ..!

Tuesday, September 15th, 2020, 11:47:46 AM IST

అమరావతిలో రాజధాని భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయగా అసైన్‌డ్ భూములు, ఇతర భూములు క్రయవిక్రయాలపై గత 15 రోజులుగా తుళ్లూరులో వీఆర్వోలు, సర్వేయర్లతో కలిసి నీట్ అధికారులు భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం నీట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, నీట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని ఏసీబీనీ ప్రభుత్వం ఆదేశించింది.

అయితే అమరావతిలో భూముల సమీకరణ విషయంలో స్కామ్ జరిగిందని వైసీపీ ముందు నుంచే ఆరోపిస్తూ వస్తుంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీనీ వైసీపీ ఇరుకున పెట్టే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓ వైపు గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయగా. మరో వైపు చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వేదికగా గళం విప్పాలని నిర్ణయించారు. అంతేకాదు సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై కూడా సీబీఐ విచారణ కోరేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.