టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు..!

Monday, November 2nd, 2020, 11:08:00 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురయ్యింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. నేడు సండ్ర వెంకట వీరయ్య పిటీషన్‌తో పాటు, ఉదయ్ సింహ పిటీషన్‌ను కూడా కొట్టివేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను కోర్టు ఈ నెల 4వ తేదికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఓటుకు నోటు విషయంలో సండ్ర వెంకట వీరయ్య కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు ఆయనను గతంలో అరెస్టు కూడా చేసింది.