ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోవటానికి కారణం ఎవరయా అనంటే.. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘విజయవాడ వాసులే’ అని ఠక్కున సమాధానం చెబుతున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఓ వ్యాసంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రాశారు. విజయవాడ ప్రజల ప్రవర్తన, ధోరణి ప్రత్యేక తెలంగాణాకు ప్రధాన కారణం అంటున్న ఆయన మాటలను చూస్తే ‘ కాల్ మనీకి ప్రధాన భాద్యత చంద్రబాబేనని అంటున్నారు. అయన తన డబ్బులిచ్చి వ్యాపారం చేయమంటే తప్పుగాని ఏవరో చేస్తే ఆయన్ను జగన్ మోహన్ రెడ్డి ఎలా తప్పుబడతారు. అయినా కాల్ మనీ వ్యవహారం ఈనాటిది కాదు ఎప్పటి నుండో పల్లెలు, మురికివాడలు, నగరాల్లో ఇది ఉంది.
ముఖ్యంగా విజయవాడలో ఎప్పటి నుండో జరుగుతోంది. అసలు ప్రత్యేక తెలంగాణా ఏర్పడటానికి విజయవాడ వాసులే కారణం. తెలంగాణలో ప్రజలు నిజాం పాలనను భరించలేక విజయవాడకు వలస వస్తే అక్కడి వారు వాళ్ళ నుండి భారీ స్థాయిలో అద్దెలను వసూలు చేసి వారిని దోచుకున్నారు. విజయవాడ వాళ్ళది ఫక్తు వ్యాపార స్వభావం. అందుకే మొదటి నుండీ తెలంగాణా ప్రజలకి విజయవాడ వాసులంటే సదాభిప్రాయం లేదు. ఆపదలో సాయం కోసం వచ్చిన వాళ్ళను ఆదుకోకపోగా అవకాశం దొరికింది కదా అని దోచుకున్నారు. రాజధాని వస్తుందని కృష్ణా, గుంటూరు మధ్య భూముల ధరలను అమాంతం పెంచేశారు.
విజయవాడ బందరు రోడ్డులో గజం 3లక్షలు పలుకుతోంది. అంత పెట్టి కొంటే వ్యాపారం గిట్టుబాటు ఎలా అవుతోంది. అందుకే డబ్బు కోసం ఈ కాల్ మనీ వ్యాపారాలు మొదలెట్టారు’ అన్నారు. గత చరిత్రను, ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న ఈ కాల్ మనీ వ్యాపారాన్ని చూస్తుంటే ఇదేదో ఆలోచించాల్సిన అంశమే అనిపిస్తోంది కదూ.