అరుణ్ జైట్లీని వదలని ఆప్ నేతలు

Wednesday, December 30th, 2015, 03:35:47 PM IST


ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ లో జరిగిన అవినీతికి అరుణ్ జైట్లీనే ప్రధాన కారణమంటూ ఆప్ నేతలు కొంతకాలం నుండి ఆరోపిస్తున్నారు. ఆ కేసుకు సంబందించిన ఫైళ్ళు సీఎం ఆఫీసులో ఉండటం వల్లే మోదీ కావాలనే కేజ్రివాల్ కార్యాలయంపై సీబీఐ దాడులు చేసేలా చేశారని కూడా ఆయన ఆరోపించారు. దీంతో రోజు రోజుకూ ఈ వ్యవహారం ముదురిపోతోంది. కానీ ఆప్ నేతలు మాత్రం ఈ అంశంలో వెనక్కు తగ్గటం లేదు. అరుణ్ జైట్లీని ఎలాగైనా నిందితునిగా నిరూపించాలని సరైన ఆధారాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తాజాగా ఆప్ నేతలు అశుతోష్, సౌరబ్, దిలీప్ పాండే బుధవారం పత్రికా సమావేశం నిర్వహించి కొన్ని నిజాలను బయటపెట్టారు. ఈ సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ‘ జైట్లీ రాజ్యసభలో విపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంలో ఢిల్లీ పోలీసులు చేస్తున్న విచారణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 2013 వరకూ దాదాపు 13 ఏళ్ళు డీడీసియే అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఢిల్లీ పోలీస్ కమీషనర్ బి.కే. గుప్తాకు అక్టోబర్ 27 2011న ఓ లేఖ రాశారు. ఆ లేఖ లో డీడీసియే అధికారులకు వ్యతిరేకంగా ఉన్న కేసులను కొట్టివేయాలని చెప్పారు.

అలాగే సిండికేట్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ కు వ్యతిరేకంగా ఉన్న కేసులను కొట్టివేయాలని అడిగారు. అలాగే మే 5 2012న ఢిల్లీ స్పెషల్ కమీషనర్ రంజిత్ నారాయణ్ కు లేఖ రాస్తూ డీడీసియే అధికారులను విచారణ జరపోద్దు అని రాశారు’ అన్నారు.

.

Keywords: