సీఎం జగన్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన యువకుడు…ఎంటో మీరే చూడండి!

Friday, November 6th, 2020, 12:26:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే లు, ఎంపీలు, అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం, సంక్షేమ పథకాలు, మొదలు పెడుతున్న అభివృద్ది పథకాలతో సీఎం జగన్ పై ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే అమరావతి విషయం లో మాత్రం టీడీపీ నేతలు ఇప్పటికీ వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ మేరకు సీఎం జగన్ చేసిన కీలక వ్యాఖ్యలకి ఒక యువకుడు దిమ్మ తిరిగే రేంజ్ లో వరుస ప్రశ్నలు సంధించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఒక మహా యజ్ఞం జరుగుతున్నప్పుడు, దేవతల యజ్ఞానికి రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నా మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా, మనమంతా ఆలోచించాల్సినది ఇటువంటి అంశాల పైనే అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒక యువకుడు ఇలా అన్నారు. రాష్ట్రంలో మహ యజ్ఞం జరుగుతోంది, దేవతల యజ్ఞానికె రాక్షసుల పీడ తప్పనప్పుడు ఇన్ని ఎకరాల భూమి ను రాజధాని కోసం ఇచ్చిన మన రైతుల ఉద్యమానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా,మనం అంతా ఆలోచించాల్సింది ఇలాంటి అంశాల మీదే అని జగన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

అయితే సీఎం జగన్ కులాల కలుపు మొక్కలు అంటూ చేసిన వ్యాఖ్యలకి సైతం యువకుడు సమాధానం ఇచ్చారు. అయితే ఒక ముఖ్యమంత్రి పదవి లో ఉండి సీఎం జగన్ ఇలా మాట్లాడటం పరువుకు సంబంధించిన విషయం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ను తెలుగు దేశం పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.