రోడ్డు మీదనే గాడనిద్ర.. శవమనుకుని భయపడ్డ జనాలు..!

Wednesday, September 9th, 2020, 01:00:41 PM IST

Deep-sleep-on-road

మన కళ్లతో చూడకుండా ఎవరో చెప్పింది విని నమ్మకూడదు అని అంటుంటారు అయిన ఒక్కోసారి మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. అప్పుడే నలుగురిలో నవ్వుల పాలవుతాం. అయితే అలాంటి సంఘటనే ఒకటి జరగడంతో అక్కడున్న వారంతా నవ్వుల పాలయ్యారు. అయితే ఘజియాబాద్‌లో ఒక వ్యక్తి రోడ్డుపై గాడంగా నిద్రపోయాడు.

అయితే ఆ వ్యక్తి తెల్లటి వస్త్రం నిండుగా కప్పుకుని రోడ్డు పక్కన పడుకోవడంతో అందరూ ఏదో గుర్తు తెలియని శవం అనుకున్నారు. ఇక కరోనా భయంతో ఎవరూ దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహసం చేయలేదు. అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దగ్గరికి వెళ్ళి చూడగా అతడు నిద్రపోయినట్టు తెలిసింది. దీంతో అతడిని లేపగా మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా నోర్లు ఎల్లబెట్టారు. గాడ నిద్రతో క్రియేట్ అయిన ఈ కామెడీ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.