ఇకపై మనుషులు కూడా గాల్లోకి ఎగురుతారట..!

Monday, January 4th, 2016, 05:49:44 PM IST

fly
ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించడానికి విమానాలను, రాకెట్లను ఉపయోగించాం. శత్రువుల జాడను కనుక్కొని వారిని పట్టుకోవడాని.. వారి స్థావరాలను ద్వంసం చేయడానికి డ్రోన్లను ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు తాజాగా డ్రోన్లను హోవర్లుగా మార్చి.. మనుషులను ఏకంగా గాల్లోకి ఎగిరే విధంగా చేస్తున్నారు. చేయడమే కాదు.. కెనడాకు చెందిన ఓ వ్యక్తి గాలిలో ఎగిరే హోవర్లను తయారు చేసి.. నీటికి ఐదు మీటర్ల ఎత్తులో 275 మీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఈ వీడియోను దాదాపు నాలుగు కోట్లమందికి పైగా వీక్షించారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఇది జనాలలోకి ఎంతగా వెళ్లిందో. ప్రయోగం దశలో ఉన్న ఈ హొవర్లు విజయవంతం అయితే.. నగరాలలో ట్రాఫిక్ సమస్యను కొంతవరకైన తగ్గించవచ్చు. హాలీవుడ్ సినిమాలో లాగా హోవర్లపై రయ్ రయ్ మంటూ గాల్లో ఎగిరిపోవచ్చు.