మహారాష్ట్రలో బస్సు బోల్తా: 8మంది ఆంధ్రులు మృతి

Tuesday, October 7th, 2014, 10:53:54 AM IST


మహారాష్ట్ర షోలాపూర్ సమీపంలోని పండరీపురంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. షిరిడి నుండి విజయవాడకు తిరిగొస్తున్న గాయత్రీ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టర్ ను ఢీకొని బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందగా 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక మృతులంతా కృష్ణా జిల్లా చిలకలపూడి చుట్టుపక్కల గ్రామస్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 50మంది ఉండవచ్చునని భావిస్తున్నారు.