రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఎంపిక చేసిన స్టేషన్ లలో రిజర్వేషన్ రీ ఓపెన్!

Friday, May 22nd, 2020, 03:11:29 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ అమలు కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా రైల్వే శాఖ కూడా ముతబడిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపు ల లో బాగంగా జూన్ 1 నుండి రైళ్లు దశల వారీగా అందుబాటులో రానున్నాయి. అయితే ఇందుకోసం రైల్వే శాఖ రిజర్వేషన్ కౌంటర్ లను ప్రారంబించింది. ఇప్పటికే ఐఆర్సిటీసి ద్వారా ఆన్లైన్ బుకింగ్ లు కూడా ఓపెన్ చేసింది. అయితే ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ లలో మాత్రమే రిజర్వేషన్ కౌంటర్ లను రీ ఓపెన్ చేసింది.

జూన్ 1 వ తేదీ నుండి రైల్వే శాఖ 200 రైళ్ళను అందుబాటు లోకి తెనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రైళ్ల లో బుకింగ్ నిన్న గురువారం ఉదయం 10 గంటలకే ప్రారంభం అయింది. కాగా తొలి రెండు గంటల్లో లక్ష 49 వేల టిక్కెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే తెలంగాణ లో మొత్తం 19 రైల్వే స్టేషన్ కౌంటర్ లలో రిజర్వేషన్ ప్రారంభం అయింది. అవి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, తాండూరు, వికారాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట, అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 43 స్టేషన్ లలో ఈ రిజర్వేషన్ కౌంటర్ లను రీ ఓపెన్ చేసింది.మొత్తం సౌత్ జోన్ లో 73 కౌంటర్ లు తెరుచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 62 గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బుకింగ్ కొరకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనీ, సామాజిక దూరం కూడా పాటించాలని సూచించారు. అయితే దీని పై రైల్వే శాఖ చాలా పతిష్ట భద్రత చర్యలు తీసుకుంటుంది.