బిగ్ న్యూస్: భారత్ లో 70 శాతం కోవిడ్ మరణాలు ఈ ఐదు రాష్ట్రాల్లో నే

Tuesday, September 8th, 2020, 10:42:52 PM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న ఈ పాజిటివ్ కేసుల పట్ల దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరోనా వైరస్ మరణాల రేటు భారత్ లో తగ్గుతుంది అని తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కారణం గా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతుంది అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

అయితే ఆగస్ట్ మొదటి వారం లో కరోనా వైరస్ మరణాల రేటు 2.15 శాతం ఉండగా, ఇప్పుడు 1.7 కి చేరింది అని అన్నారు. అయితే 14 రాష్ట్రాలతో సహ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయిదు వేల కన్నా తక్కువగా కేసులు ఉన్నాయి అని తెలిపారు.భారత్ లో మిలియన్ జనాభా కి 3,102 కేసులు నమోదు అవుతున్నాయి అని పేర్కొన్నారు. అయితే పది లక్షల మందికి 53 మంది ప్రాణాలను కోల్పోతున్నారు అని వివరించారు. అయితే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, యూపీ, తమిళ నాడు రాష్ట్రాల్లో 62 శాతం కరోనా వైరస్ యాక్టిివ్ కేసులు ఉన్నాయి అని, ఈ రాష్ట్రాల్లో 70 శాతం మరణాలు సంభవించాయి అని అన్నారు.