హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ కంటైన్‌మెంట్ జోన్లు..!

Friday, April 23rd, 2021, 01:40:38 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుంది. అయితే రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుండడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా చర్యల్లో భాగంగా మినీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది. ఈ కంటైన్మెంట్ జోన్లలో నిరంతరం శానిటైజేషన్తో పాటు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక్క ఏరియా పరిధిలో 5 కేసుల కంటే ఎక్కువగా ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే కంటైన్‌మెంట్ జోన్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.