తుది విడత లో మరో 549 సర్పంచ్ లు ఏకగ్రీవం

Wednesday, February 17th, 2021, 09:24:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యారు. అయితే ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం గా ఎన్నిక అయిన సర్పంచ్ ల సంఖ్య 2,192 కి చేరింది. అయితే జిల్లాల వారి గా చూసుకుంటే, చిత్తూరు లో 153,వైఎస్సార్ లో 105, విజయ నగరం లో 58, నెల్లూరు లో 55, పశ్చిమ గోదావరి జిల్లాలో 29, తూర్పు గోదావరి లో 14, విశాఖ పట్టణం లో 14, శ్రీకాకుళం లో 15, కృష్ణా లో 13, గుంటూరు లో 26, ప్రకాశం లో 40, కర్నూలు లో 27 ఏకగ్రీవాలు కాగా, అనంతపురం లో ఒక్కటి కూడా లేదు. అయితే ఈ నాలుగో విడత లో కూడా వైసీపీ బల పరిచిన అభ్యర్దులు ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు తెలుస్తోంది.