గ్రామ పంచాయితీల్లో 523 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం

Friday, February 5th, 2021, 09:59:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ పంచాయితీ లలో వార్డ్ స్థానాలకు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పలు చోట్ల ఏక గ్రీవాలు జరగడం తో అధికారులు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తోలి విడత ఎన్నికలకి సంబందించి 523 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. తొలి విడత నామినేషన్ ల ఉప సంహరణ కూడా గురువారం నాడు ముగిసింది. మొత్తం 3,249 గ్రామ పంచాయితీ లకు నోటిఫికేషన్ విడుదల కాగా, 19,491 మంది సర్పంచ్ స్థానాలకు, 79,799 మంది వార్డ్ సభ్యుల కోసం నామినేషన్ వేశారు. అయితే సర్పంచ్ స్థానాలకు సంబందించి ఇందులో 1,323 నామినేషన్లు తిరస్కరణ కి గురి అయినట్లు తెలిపారు.

అయితే విడత ల వారీగా ఈ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ 523 స్థానాలకు సర్పంచ్ లు ఏకగ్రీవం అవ్వగా, వార్డ్ సభ్యుల స్థానాలు కూడా ఎక్కువ మొత్తం లో ఏక గ్రీవం అయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన పంచాయితీ మరియు వార్డ్ స్థానాలకు ఈ నెల 9 న పోలింగ్ జరగనుంది.