భారత్‌లో కరోనా కల్లోలం.. నిమిషానికి 48 కొత్త కేసులు..!

Sunday, August 23rd, 2020, 11:00:56 AM IST

india_corona

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిమిషానికి 48 కొత్త కేసులు నమోదవుతుంటే, గంటకు 38 మరణాలు నమోదవుతున్నాయి. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 69,239 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,44,940 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,07,668 యాక్టివ్ కేసులు ఉండగా, 22,80,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 912 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 56,706కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,01,147 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 74.90 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.