టాలీవుడ్ స్టార్ కమెడియన్ పై 420 కేసు !

Monday, October 10th, 2016, 10:07:36 AM IST


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కామెడియన్లలో ఒకరైన 30 ఇయర్స్ పృథ్వి సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. ఎన్నాళ్లగానో పరిశ్రమలో ఉన్న ఆయనకు ఈ మధ్యే టైం కలిసొచ్చి స్టార్ కమెడియన్ అయ్యారు. రచయితలు, దర్శకులు ఈయన కోసమే సపరేట్ గా పాత్రలు రాస్తున్నారు. అలాంటి ఈయనపై 420 కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పృథ్వి తనను పెళ్లి చేసుకుని మోసం చేశారని పిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు ఆయనపై 498 ఏ, 420 కేసులు నమోదు చేశారు. ఈ వార్త ప్రసుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ మేరకు పృథ్వి ఆమెతో రాజి కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అసలు ఆ మహిళ కావాలనే పృథ్విని టార్గెట్ చేసిందా లేకపొతే ఇందులో పృథ్వి తప్పేమన్నా ఉందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.