మహారాష్ట్ర లో భారీగా కరోనా కేసులు నమోదు…ఒక్క రోజే 391 మంది మృతి!

Thursday, September 3rd, 2020, 11:14:51 PM IST

Corona_india
భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారీగా నమోదు అవుతున్న ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే మహారాష్ట్ర లో ఈ వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గడిచిన 24 గంటల్లో 18,105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా గా నమోదు అయిన ఈ కేసులతో కలిపి ఆ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,43,844 కి చేరింది.

మహారాష్ట్ర లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 391 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 25,586 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మహారాష్ట్ర లో భారీగా కేసుల సంఖ్య ఉండటం తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 13,988 కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 6.12 లక్షల మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2.05 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.