అంటార్కిటికాలో కూడా నమోదు అయిన కరోనా కేసులు

Wednesday, December 23rd, 2020, 02:41:25 PM IST

Corona
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా విడిచి పెట్టలేదు. ఇప్పటి వరకూ అంటార్కిటికా లో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదు. అయితే తాజాగా చిలీ కి చెందిన ఓ పరిశోధనా కేంద్రం లో పని చేస్తున్న 36 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ మేరకు అక్కడి అధికారులు, సైన్యం ఇక ప్రకటన విడుదల చేశారు. అయితే అందులో 26 మంది సైన్యం కాగా, మిగిలిన వారు నిర్వహణ సిబ్బంది అని ప్రకటన లో తెలిపారు. అయితే కరోనా వైరస్ సోకిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారు అంతా కూడా ప్రస్తుతం ఆరోగ్యం గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అంటార్కిటికా కి పర్యాటకుల ను నిషేధించిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఈ మహమ్మారి ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.