బిగ్ అలర్ట్: తెలంగాణలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా..!

Saturday, February 20th, 2021, 09:35:44 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కరీంనగర్ జిల్లా చేగుర్తి మండలంలో 10 రోజుల కిందట ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు.

అయితే ఈ అంత్యక్రియలకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్ధుంపూర్ గ్రామాల వాసులు వచ్చారు. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడంతో 33 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే వీరిలో 32 మంది చేగుర్తి గ్రామస్తులే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ రోజు కూడా గ్రామంలో మరింత మందికి కరోనా టెస్టులు చేయనున్నారు.