కరోనా అప్డేట్: భారత్‌లో 29 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Friday, August 21st, 2020, 10:49:08 AM IST

భారత్‌లో గత కొద్ది రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షల మార్క్ దాటింది. అయితే గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 69,652 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,824 కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 6,92,028 యాక్టివ్ కేసులు ఉండగా, 21,58,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 983 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,05,985 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 73.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.