దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన 23 మంది.. ఫుల్ లిస్ట్ ఇదే..!

Tuesday, October 20th, 2020, 02:11:40 AM IST

దుబ్బాక ఉప ఎన్నిక పోరు ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. అయితే ఈ ఉప ఎన్నికకు మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 12 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 23 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బరిలో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బిగ్‌బాస్ ఫేమ్, యానక్ర్ కత్తి కార్తీక బరిలో ఉన్నారు. మరో నలుగురు అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి బరిలో ఉండగా, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇక నవంబర్ 3వ తేదిన ఇక్కడ పోలింగ్ జరుగుతుండగా, 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.