ఏపీలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కొత్తవి ఎన్నంటే?

Friday, August 7th, 2020, 09:12:30 PM IST


ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 62,938 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,171 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 89 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 7,594 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మొత్తం పాజిటివ్ కేసులు 2,06,960కి చేరగా అందులో 84,654 మంది చికిత్స పొందుతుండగా, 1,20,464 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,842కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,62,270 శాంపిల్స్ పరీక్షించారు.