దారుణం: కొవిడ్ బాధితురాలి పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం

Sunday, September 6th, 2020, 11:03:15 PM IST

దేశం లో జరుగుతున్న పలు సంఘటనలు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ సైతం అత్యాచారాలు జరగడం ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది. కేరళ లో మరొక అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ భారిన పడిన 19 ఏళ్ల యువతిని అంబులెన్స్ డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆసుపత్రి తీసుకెళ్లేందుకు సదరు యువతి అంబులెన్స్ లో బయలు దేరగా, ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

కేరళ లో తిరువనంతపురం కి 100 కిలో మీటర్ల దూరం లో ఉన్న పఠన మిట్ట ప్రాంతం లో 19 ఏళ్ల యువతి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రి లో చేరేందుకు అంబులెన్స్ ద్వారా ప్రయాణం చేసేందుకు సిద్దం అయింది. నౌ ఫాల్ అనే డ్రైవర్ ఆమెతో పాటుగా ఒక వృద్ధురాలి ను సైతం అదే అంబులెన్స్ లో తీసుకు వెళ్ళాడు. వీరిద్దరినీ వేర్వేరు ప్రాంతాలకి తీసుకు వెళ్లాల్సి రావడం తో మొదట వృద్ధురాలిని దింపేసాడు. అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆ యువతిని అత్యాచారం చేసి, అనంతరం కొవిద్ కేర్ సెంటర్ లో వదిలేశాడు.

అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం తో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. పలు క్రిమినల్ కేసుల్లో ఇప్పటికే ఆ డ్రైవర్ భాగం అయినట్లు తెలుస్తోంది. అయితే శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన పై ఆరోగ్య శాఖ మంత్రి శైలజ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.