ఆ దేశం లో ఒకే రోజు 1,910 కరోనా మరణాలు…ఆందోళనలో ప్రజలు

Thursday, March 4th, 2021, 02:07:15 PM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మరణాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లాటిన్ అమెరికన్ దేశం అయిన బ్రెజిల్ ను ఈ మహమ్మారి వణికిస్తోంది. అక్కడ రోజురోజుకీ కరోనా వైరస్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తాజాగా 1,910 మంది ఒక్క రోజులోనే ప్రాణాలను కోల్పోవడం భయ భ్రాంతులకి గురి చేస్తోంది. ప్రపంచం లోనే బ్రెజిల్ మరణాల విషయం లో రెండవ స్థానం లో కొనసాగుతుంది. ప్రపంచం లో నమోదు అవుతున్న గణాంకాల ప్రకారం అమెరికా లో ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారిన పడి 5,31,652 మంది ప్రాణాలను కోల్పోయారు. రెండవ స్థానం లో ఉన్న బ్రెజిల్ లో 2,59,402 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి కి టీకా లు వచ్చినా మరణాలు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. అయితే మొదటి సారి ఇక్కడ బ్రెజిల్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి అంటూ ప్రజారోగ్య సంస్థ అయిన ఫియొక్రజ్ హెచ్చరికలు జారీ చేసింది.అంతకు ముందు రోజు 1,641 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వారం రోజుల నుండి సగటున 1,331 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.