బిగ్ న్యూస్: ఏపీ సచివాలయంలో 19 మందికి కరోనా..!

Thursday, September 17th, 2020, 09:35:24 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు దాదాపుగా 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఓ పక్క రికవరీలు పెరుగుతున్నా కేసులు, మరణాలు మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే సామాన్య జనంతో పాటు అనేక మంది ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.

అయితే ఏపీ సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతుంది. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో 19 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒకరు అసెంబ్లీ సహాయ కార్యదర్శి కాగా, మిగతా 18 మంది సచివాలయంలోని వివిధ శాఖలకు చెందిన వారు ఉన్నారు. అయితే సచివాలయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.