ఆధార్‌తో మీ పాన్ కార్డ్ లింక్ చేయలేదా.. మీ కార్డుపై వేటు పడబోతుంది..!

Friday, August 21st, 2020, 01:17:10 PM IST

దేశంలో పాన్ కార్డ్ కలిగిన వారందరూ వారి కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని చెబుతున్నా చాలా మంది కేర్‌లెస్‌గా ఉంటూ అసలు దీనిని పట్టించుకోవడం లేదు. మార్చి 31, 2021 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేయాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆధార్‌తో లింక్ చేయని 18 కోట్ల పాన్ కార్డులను గుర్తించామని, గడువు ముగిసేలోగా వాటిని ఆధార్‌తో జోడించకపోతే వాటన్నిటిని రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.

అయితే ఒకటి అంతకంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను కట్టని వారిని గుర్తించే పనిలో ఉన్నామని, పన్నులను ఎగవేసేందుకే ఒకటి కన్న ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారని అందుకే ఆధార్‌తో లింక్ చేయడం లేదని అన్నారు. ఇక దీనిని పక్కన పెడితే పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పన్నుల విధానం సులభం, పారదర్శకం కానుందని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని కోరుతున్నారు.