బ్రేకింగ్: కేరళ విమాన ప్రమాదం 16 కి చేరిన మృతుల సంఖ్య!

Saturday, August 8th, 2020, 12:30:02 AM IST


కేరళ లో ను కోజికొడ్ విమాన ప్రమాదం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకూ 16 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే దుబాయ్ నుండి కోజికోడ్ కి ఎయిర్ ఇండియా కి చెందిన డిఎక్స్ బీ – సిసిజే బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్ వే పై ల్యాండ్ అవుతూ జారీ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఒక పైలట్ తో సహా 16 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ ఘటన లో మరో 138 మంది కి తీవ్రంగా గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పై ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటన పై కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కి ఫోన్ చేసి ఆరా తీశారు. ఎయిర్ ఇండియా అధికారులతో సైతం చర్చించిన అనంతరం, అక్కడ సహాయక చర్యలు, వైద్య సేవలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కి ఆదేశాలను జారీ చేశారు. ఈ ఘటన పై హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటన అత్యంత విచారకరం అని అన్నారు. సహాయక చర్యలు చేపట్టాలని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు ఆదేశాలను జారీ చేసారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.