జగిత్యాల గురుకుల పాఠశాలలో 15 మందికి సోకిన కరోనా!

Friday, March 19th, 2021, 03:18:42 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నప్పటి నుండి కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే జగిత్యాల జిల్లా కేంద్రం లో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో 15 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే మొత్తం 200 మంది వరకు ఉన్న ఆ గురుకుల లో 20 మంది గత కొద్ది రోజులుగా జ్వరం తో బాధపడుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కరోనా అనుమానితులు గా ఉన్న వారికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 15 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారిని వసతి గృహం లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ పెరగడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.