వారెవ్వా..అయోధ్య రామాలయానికి వెండి ఇటుకలు..!

Sunday, August 2nd, 2020, 01:45:38 AM IST


అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగష్ట్ 5వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. అయితే ఈ ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహత్తరమైన పుణ్యకార్యానికి మేము సైతం అంటూ హైదరాబాద్‌కు చెందిన భక్తులు 11 కేజీల వెండి ఇటుకలను ప్రధానం చేయబోతున్నారు.

అయితే హైదరాబాద్‌లోని వేదనిలయం, పవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వెండి ఇటుకలను రామ మందిర నిర్మాణం కొరకై ఇవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ట్రస్టు బోర్డు ఆహ్వానం పంపనుంది. కరోనా కారణంగా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వీలు లేదు కాబట్టి ఈ ప్రత్యేక్ష కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా లైవ్ ఇస్తామని భక్తులందరూ ఇంట్లోనే ఉండి చూడాలని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.