1.5 లక్షల డోసుల కోవిషీల్డ్ వాక్సిన్ భూటాన్ కి ఎగుమతి

Wednesday, January 20th, 2021, 12:23:23 PM IST

భారత్ నుండి ఆమోదం పొందిన సీరం ఇనిస్టిటట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ ను ఇతర దేశాలకు సరఫరా చేయడం ప్రారంబించింది. ఇతర దేశాలతో ఉన్న ఒప్పందం మేరకు భారత్ కొవిషీల్డ్ వాక్సిన్ లను భూటాన్ కి ఎగుమతి చేసింది. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 1.5 లక్షల డోసుల వాక్సిన్ ను ధింపు నగరానికి సరఫరా చేసింది.

అయితే ఈ వాక్సిన్ సరఫరా మాల్దీవ్స్ ల తో పాటుగా ఇతర దేశాలు అయిన బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు సరఫరా చేయనుంది భారత్. అయితే భారత్ సంస్థలు అభివృద్ధి పరచిన ఈ టీకాలను పొరుగు దేశాలకు కూడా ఇవ్వనున్నారు. అయితే ఇతర దేశాలకు, వారికి ఉన్న అవసరాల మేరకు వీటి సరఫరా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.