ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : వరల్డ్ ఫేమస్ లవర్

Thursday, February 13th, 2020, 05:00:31 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఏకంగా నలుగురు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్,రాశీ ఖన్నా,క్యాథెరిన్ మరియు ఇలజబెల్ లెయిట్ ల కలయికలో కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” డియర్ కామ్రేడ్ లాంటి ప్లాప్ తర్వాత కూడా మంచి అంచనాలను ఈ చిత్రం ఏర్పర్చుకుంది.ఈ ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల కాబడిన ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.

లవర్స్ డే రోజున విడుదల కాబడిన ఈ చిత్రంలో ఇప్పటి వరకు వచ్చిన ఎమోషన్స్ బాగున్నాయి.అలాగే విజయ్ మేకోవర్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి.రాశీ మరియు విజయ్ ల సన్నివేశాలతో మొదలయిన ఈ చిత్రంలో ఇప్పటికి నలుగురిలో ముగ్గురు హీరోయిన్లు పరిచయం అయ్యిపోయారు.కాకపోతే కథనం మాత్రం అలా నెమ్మదిగా సాగుతున్న భావన ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది.విజయ్ కు ఐశ్వర్య రాజేష్ మరియు రాశీ ఖన్నాల మధ్య ట్రాక్స్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.