“వకీల్ సాబ్” ను దిల్ రాజు డిజిటల్ లో రిలీజ్ చేస్తారా!?

Friday, September 18th, 2020, 11:13:42 PM IST

Vakeel_sab
పవన్ కల్యాణ్ క్రేజ్ దృష్ట్యా వకీల్ సాబ్ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పింక్ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాక చాలా విరామం తర్వాత పవన్ మళ్లీ ఈ సినిమా తో రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరొక వార్త ఫిల్మ్ ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది.

థియేటర్లు ముతపడటం తో అంతా కూడా ఓటిటీ బాట పట్టారు. దాదాపు ఆరు నెలల సమయం గడిచినా ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఇంకా ధియేటర్స్ ఓపెన్ కాలేదు. అయితే ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో 90 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్లు ఇది వరకే వార్తలు రాగా, ఇప్పుడు 110 కోట్ల రూపాయల తో డిజిటల్ రైట్స్ కొనేందుకు సిద్దం అయింది. అయితే దిల్ రాజు ఇంకా ఈ విషయం పై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా ధియేటర్స్ లో విడుదల అయితే అంతకుమించి భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అయితే అభిమానులు కూడా ధియేటర్స్ లో నే పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇంత భారీ ఆఫర ను కూడా దిల్ రాజు వదులుకునేందుకు సిద్దంగా లేరు అని తెలుస్తోంది. బోని కపూర్ తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పై దిల్ రాజు ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా, విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ లు సినిమా పై అంచనాలు పెంచేశాయి.