పవన్, మహేష్ లు ఫెయిల్ అవ్వడానికి బన్నీ, నితిన్ లు పాసవ్వడానికి కారణం అదేనా..?

Friday, June 17th, 2016, 05:11:00 PM IST


ఈ సంవత్సరం టాలీవుడ్ లో ఓ విచిత్రమైన తీరు కనబడుతోంది. బడా స్టార్లని పేరున్న హీరోలిద్దరూ హిట్టుకొట్టలేకపోయారు. వాళ్ళే పవన్, మహేష్. టాప్ హీరోలైన ఈ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు డిజాస్టర్ సినిమాలను అందించారు. కానీ వీళ్ళ తరువాతి హీరోలుగా చెప్పుకునే బన్నీ, నితిన్ లు మాత్రం వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లను కొట్టి తమ సత్తా చూపారు. ఇందుకు కారణం కథ. అవును సినిమాలో కథ ఉంటే సినిమా ఆడుతుంది. లేకుంటే ఎంత పెద్ద స్టారైనా ఫ్లాపవుతుంది.

సాంప్రదాయం ప్రకారం కథకి హీరో ఫాలోయింగ్ తోడై సినిమా పెద్ద విజయం సాదించాలి. కానీ మనోళ్ళు మాత్రం తమ ఫాలోయింగ్ కు సినిమా కథ సూటవ్వాలి అనే సూత్రాన్ని ఫాలోఅవుతున్నారు. అందుకు నిదర్శనం సర్దార్, బ్రహ్మోత్సవం సినిమాలే. ఈ రెండు సినిమాల్లో కథ ఉండదు. స్టార్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. కనీ వీళ్ళ తరువాత వచ్చిన బన్నీ సరైనోడు. నితిన్ అ..ఆ.. లు ఇప్పటికే 70 కోట్ల క్లబ్స్ లో చేరిపోయాయి. అందుకు కారణం వీళ్ళు తమ సినిమాల్లో కాస్తో కూస్తో కథకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. కాబట్టి హీరోలు ఎవరైనా సినిమాలూ కంటెంట్ ఉండేట్టు చూసుకుంటే మంచిది.