ఇలాంటి సినిమాను ఎందుకు పక్కన పెట్టేసారు?

Sunday, January 26th, 2020, 10:29:00 PM IST

కొన్ని హిట్టు సినిమాలను వెండితెరపై ఏ స్థాయిలో అయితే ప్రేక్షకులు వీక్షిస్తారో అంతే స్థాయిలో ఆ సినిమాలను బుల్లితెర మీద టెలికాస్ట్ చేసినపుడు కూడా వీక్షిస్తారు.అయితే ఇప్పటికీ కూడా భారీ హిట్ అయిన చిత్రాలు ఇంకా మన దగ్గర టెలికాస్ట్ కు నోచుకోలేదు.ప్లాప్ అయిన సినిమాలను టెలికాస్ట్ చెయ్యలేదు అంటే ఓకే కానీ భారీ హిట్టయిన సినిమాలను ఎందుకు టెలికాస్ట్ చెయ్యడం లేదు అన్న ప్రశ్న ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ను తొలచి వేస్తుంది.అలా చాలా కాలం నుంచి మన తెలుగు ఆడియన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీయఫ్ చాప్టర్ 1” అని చెప్పాలి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ దేశ వ్యాప్తంగా మరోసారి దక్షిణాది సినిమా సత్తా అంటే ఏమిటో రుచి చూపించింది.అంతే కాకుండా ఈ చిత్రం తాలుకా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ లో 2019లో అత్యధికంగా వీక్షించిన ఆల్ టైం ఇండియన్ సినిమాగా నిలిచింది.కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా ఏ టెలివిజన్ ఛానెల్లోనూ టెలికాస్ట్ అవ్వలేదు.దీనికి గల కారణం ఏంటో కూడా ఇంకా ఎవరికీ తెలీదు.ఇంత పెద్ద హిట్టయిన సినిమాను కూడా మన తెలుగు ఛానెల్స్ వారు ఎందుకు పక్కన పెట్టేసారో మరి..?రాబోయే రోజుల్లో అయినా సరే ఈ చిత్రం ఏదన్నా ఛానెల్ టెలికాస్ట్ చేస్తుందో లేదో చూడాలి.