బన్నీ, మహేశ్‌లలో అసలు సంక్రాంతి విన్నర్ ఎవరంటే..!

Wednesday, January 22nd, 2020, 11:30:31 PM IST

ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురంలో, సరిలేరు నీక్వెవరు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మికా మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్‌లోనే విడుదలై కలెక్షన్లను రాబట్టడంలో నువ్వ నేనా అన్న మాదిరిగా పోటీ పడుతున్నాయి.

అయితే ఒక్క రోజు ముందుగానే మహేశ్ సినిమా వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం మహేష్ బాబు సినిమా కంటే అల్లుఅర్జున్ సినిమా వసూళ్లు ముందున్నట్లు తెలుస్తుంది. మహేశ్ సరిలేరు నీకెవ్వరు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల గ్రాస్ సాధించినట్టు తెలుస్తుంది. అయితే ఒక్క రోజు ఆలస్యంగా వచ్చినా కూడా బన్నీ మహేశ్ కలెక్షన్లను దాటేసినట్టు సమాచారం. ఏదేమైనా కలెక్క్షన్ల గోలను కాస్త పక్కనపెడితే రెండు సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ ఇద్దరు సంక్రాంతి విన్నర్స్ అనే చెప్పాలి.