అనుష్క బ్యాక్ పెయిన్ కి కారణం?

Wednesday, April 1st, 2015, 11:38:22 AM IST

anushka-sharma
ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల ప్రపంచ కప్ లో ఇండియా ఆటను వీక్షించడానికి ప్రియుడు విరాట్ కోహ్లీకి మద్దతుగా ఆస్ట్రేలియాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ కప్ లో కోహ్లీ వైఫల్యానికి అనుష్కను ముడిపెడుతూ క్రికెట్ అభిమానుల నుండి వచ్చిన విమర్శలు కూడా మనకు తెలియనివి కావు. అయితే ఇటీవల అనుష్క బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నడుం నొప్పిని కూడా ఆస్ట్రేలియా పర్యటనతో ముడిపెడుతూ వస్తున్న విమర్శలపై అనుష్క ఫైర్ అయ్యింది.

దీనిపై అనుష్క శర్మ మాట్లాడుతూ ఊహాగానాలకు కూడా హద్దుండాలని, తన నడుం నొప్పికి, ఆస్ట్రేలియా పర్యటనకు మధ్య సంబంధమేమిటని నిలదీసింది. అలాగే ఎన్ హెచ్-10 సినిమా షూటింగ్ సమయంలో తనకు బ్యాక్ పెయిన్ మొదలైందని, తీరిక లేక చూపించుకోలేదని, ఇప్పుడు ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటే ఊహాగానాలు అల్లడం అన్యాయమని అనుష్క ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కోహ్లీతో బంధాన్ని తాను దాచలేదని, అతనితో ఉన్నప్పుడు ఫోటోలు తీస్తున్న ఏమి అనడంలేదని, అయినా తమ బంధంపై రార్ధంతం చెయ్యడం భావ్యం కాదని అనుష్క వాపోయింది.