విరుష్క అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!

Thursday, August 27th, 2020, 01:37:31 PM IST

విరుష్క అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందింది. విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాక టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అయితే కొద్ది సేప‌టి క్రితం కోహ్లీ తన అభిమానుల‌కి ఓ తీపికబురు అందించారు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్టు తెలిపాడు.

అయితే ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్నాడు అంటూ అనుష్క పక్కన తాను నిలబడిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే కోహ్లీ ట్వీట్‌కి కామెంట్ల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియాలో అనుష్క, విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు.