మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Thursday, February 13th, 2020, 09:29:55 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా “సరిలేరు నీకెవ్వరు” సక్సెస్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.ఈ సినిమా విజయం తర్వాత మహేష్ కు దీనికి ముందు మహేష్ మైల్ స్టోన్ 25 వ చిత్రంగా “మహర్షి” లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లితో తన 27వ చిత్రానికి అవకాశం ఇచ్చారు.అయితే ఇంకా ఎలాంటి షూటింగ్ కానీ ముహూర్తం కానీ ఫిక్స్ చేసుకోని ఈ చిత్రంపై ఎలాంటి అధికారిక అప్డేట్లు లేకపోవడంతో మహేష్ అభిమానులు ప్రస్తుతం బయటకొస్తున్న చిన్న చిన్న గాసిప్స్ మరియు బజ్ న్యూస్ లతోనే సరిపెట్టుకుంటున్నారు.

ఇప్పుడు అలాంటి న్యూస్ ఒకటి బయటకొచ్చింది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు సంగీత దర్శకుడు ఎవరు అన్న విషయం ఖరారు కాలేదని ఆ విషయంలోనే వంశీ కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.దీనితో ఈ చిత్రానికి తమ రొటీన్ సంగీత దర్శకులను పక్కన పెట్టి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను అనుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీనితో ఈ వార్తలు ఒట్టి గాలి వార్తలుగా మిగిలిపోకుండా నిజమైతే అదిరిపోతుంది అని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.