అల్లు అర్జున్ కి సరైన విలన్ దొరికినట్లేనా?

Thursday, November 26th, 2020, 05:35:23 PM IST

Allu-Arjun-in-Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం గతం లో విజయ్ సేతుపతి ను తీసుకోగా, డేట్లు సర్దుబాటు కావడం తో అతను తప్పుకున్నాడు. అయితే పుష్ప చిత్రం లో విలన్ పాత్ర ఇతనే అంటూ ఇప్పటికే బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. తమిళ నాట ఆది, ఆర్య, మాధవన్ ల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం హీరో చియాన్ విక్రమ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే పాత్ర విన్న వెంటనే విక్రమ్ పుష్ప లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తో దేవి శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్ లు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠ పురం లో చిత్రం విజయం తర్వాత అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.