వాయిదా పడ్డ విజయ్ లైగర్ టీజర్ విడుదల!

Sunday, May 9th, 2021, 01:30:10 PM IST


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ చిత్రం లో అనన్య పాండే కథానాయిక గా నటిస్తోంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ లో విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటం అన్నీ కూడా భయాందోళన కలిగించేవి అని చెప్పాలి. అయితే లైగర్ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా టీజర్ ను వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా అభిమానులను అలరించనున్నాడు అని తెలుస్తోంది.

అయితే టీజర్ విడుదల ఆలస్యం అయినప్పటికీ అభిమానులను ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయదు అంటూ చెప్పుకొస్తున్నారు చిత్ర యూనిట్.అయితే ఇదే విషయం పై విజయ్ దేవరకొండ సైతం స్పందించారు. మన కుటుంబాలు జాగ్రత్తగా, సంతోషంగా ఉండే వరకూ ఎదురు చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే సమయం వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు అని ఆశిస్తున్నా అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అయితే విజయ్ కుమార్ కొండ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా లైగర్ చిత్రాన్ని పూర్తి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.