బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ .. కన్ఫర్మ్ ?

Wednesday, September 19th, 2018, 10:17:30 AM IST

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తాజగా గీత గోవిందం సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో 100 కోట్ల హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అయన నటిస్తున్న టాక్సీవాలా త్వరలోనే విడుదల కానుంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయింది ? విజయ్ దేవరకొండ ను బాలీవుడ్ లోకి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలిసింది.

స్వప్న సినిమా పతాకం పై స్వప్న దత్ నిర్మించే ఈ చిత్రానికి దర్శక ద్వయం రాజ్- డీకే దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని .. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న నోటా సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతో విజయ్ అటు కోలీవుడ్ లోను ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.