చిరు సినిమా లో విజయ్ దేవరకొండ… అసలు మ్యాటర్ ఇదేనా!?

Thursday, July 9th, 2020, 01:05:21 AM IST


మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆచార్య చిత్రం లో నటిస్తూనే, లూసీ ఫర్ చిత్రం ను ట్రాక్ లో పెట్టేశారు. అయితే ఆచార్య చిత్రం లో రామ్ చరణ్ నటిస్తున్నారు అని వార్త చెక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుదిరం చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ల కారణం గా రామ్ చరణ్ లూసీ ఫర్ లో పృధ్వీ రాజ్ చేసిన పాత్రను నటించేందుకు సమయం లేదని తెలుస్తోంది.

అయితే ఈ పాత్ర కోసం రామ్ చరణ్, మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇందుకు విజయ్ సైతం ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే సా హొ చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేసుకొని చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చిరు చేస్తున్న ఆచార్య చిత్రం కారణంగా ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యం గా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్రం లో విజయ్ దేవరకొండ ఛాన్స్ దక్కించుకోవడం అనే విషయం పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో చూడాలి.