ప్రేమిస్తున్నా.. కానీ పెళ్ళికి సిద్దంగా లేనంటున్న విజయ్ దేవరకొండ..!

Wednesday, February 12th, 2020, 08:24:44 PM IST

పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి, గీతగోవిందం వంటి సక్సెస్ సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రౌడీ హీరో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫిబ్రవరి 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండకు తన పెళ్ళి ప్రస్తావనపై ఒక ప్రశ్న ఎదురయ్యింది. అయితే దీనికి విజయ్ సమాధానమిస్తూ తాను తన కెరిర్‌ను ప్రేమిస్తున్నానని, వివాహ బంధంపై తనకు ఎంతో గౌరవం ఉంది కానీ తాను ఇప్పుడు పెళ్ళి చేసుకోవటానికి సిద్దంగా లేనని తేల్చి చెప్పాడు. ఇంకా జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటున్నానని అప్పటివరకు పెళ్ళికి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.