రాజమౌళి కూడా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు – విజయ్ దేవరకొండ

Friday, July 31st, 2020, 08:43:48 PM IST

కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి ప్లాస్మా ఎంతో విలువైనది అని తెలుస్తోంది. ఒకరి ప్రాణాలను కాపాడే విధంగా అది పలు చేస్తోంది. అయితే ప్లాస్మా దానం గురించి నటుడు విజయ్ దేవరకొండ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్మా దానం చేసి ప్రాణ దాతలుగా నిలుస్తున్న వారికి సన్మానం చేశారు పోలీస్ అధికారులు. అయితే సీపీ సజ్జనార్ కార్యాలయం లో విజయ్ దేవరకొండ తో కలిసి ప్లాస్మా యోధుల పోస్టర్ ను ఆవిష్కరించి పలు వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తన స్నేహితుడు తండ్రి కి కరోనా వైరస్ సోకి ప్లాస్మా అవసరం వచ్చింది అని తెలిపారు. ప్లాస్మా దానం ద్వారా బాధితులకు అండగా ఉంటుంది అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే దర్శకుడు రాజమౌళి సైతం ప్లాస్మా దానం కోసం ముందుకు వస్తున్నారు అని విజయ్ అన్నారు. అయితే ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నే, ప్లాస్మా దానం కోసం ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎక్కువగా ప్లాస్మా దానం కోసం వస్తారు అని ఆశిస్తున్నా అంటూ విజయ్ అన్నారు.