డర్టీ హరి సినిమా పోస్టర్స్ పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్

Wednesday, December 23rd, 2020, 08:00:48 PM IST


డర్టీ హరి సినిమా పోస్టర్స్ మహిళలను అగౌరవ పరిచే విధంగా, యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు మరియు అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీ ల పై పోలీస్ కేసులు పెట్టాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ ను కోరారు. అయితే గుంటూరు ఉండవల్లి సెంటర్ లో ,ఇతర ప్రాంతాల్లో అనేక చోట్ల వేసినటువంటి పోస్టర్లను వెంటనే తొలగించాలని కోరారు. అయితే ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల కి సిద్దం అయింది.