వరుణ్ తేజ్ నిలబడతాడా? తప్పుకుంటాడా.?

Tuesday, February 16th, 2021, 08:08:23 PM IST

మెగా ఫ్యామిలీ హీరోలలో కాస్త వినూత్నమైన సబ్జెక్టులను ఎంచుకొనే హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ అటెంప్ట్స్ చేసిన వరుణ్ ఇప్పుడు నటిస్తున్న మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రం “గని”. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అలాగే ఆ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడంతో మంచి బజ్ ఏర్పడింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించేసారు. మరి ఇప్పుడే అసలు హాట్ టాపిక్ మొదలయ్యింది. ఇదే జూలై నెలలో చాలా సినిమాలే జస్ట్ స్వల్పమైన గ్యాప్ తో విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం విడుదల కాబోతున్న జూలై 30నే యంగ్ రెబల్ స్టార్ ప్రబస్ హీరోగా నటిస్తున్న “రాధే శ్యామ్” లేటెస్ట్ గా తమ విడుదల తేదీని ప్రకటించింది.

దీనితో ఈ పాన్ ఇండియన్ లెవెల్ సినిమా అదే డేట్ కు రావడంతో గని సినిమా పరిస్థితి ఏమిటి అన్నది చర్చగా మారింది. మరి ఆయా టైం కి పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఇప్పటి నుంచే రచ్చ మొదలయ్యింది. అయితే మరి ఈ స్ట్రాంగ్ రేస్ లో వరుణ్ తేజ్ నిలబడతాడా లేక తప్పుకుంటాడా అన్నది చూడాలి.