అలరిస్తున్న వకీల్ సాబ్ టీజర్..!

Friday, January 15th, 2021, 09:39:08 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం విడుదల కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర టీజర్ సంక్రాంతి పండుగ రోజున చిత్ర యూనిట్ విడుదల చేసింది. పండుగ రోజున టీజర్ విడుదల తో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలైన పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఈ చిత్రం నిన్న సాయంత్రం విడుదల కాగా, ఇప్పటి వరకూ 7 మిలియన్ ల రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకూ 7 లక్షలకు పైగా లైక్స్ ను సాధించింది.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపు మూడు సంవత్సారాలు తర్వాత రానున్న ఈ చిత్రానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వెల్లినప్పటికీ కూడా పవన్ సినిమాలు చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కి విడుదల కానుంది. ఈ చిత్రం కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేణు శ్రీ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో అంజలి, నివేద థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, శృతి హాసన్ పవన్ సరసన కనిపించనుంది.