వకీల్ సాబ్ నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. టీజర్ ఎప్పుడంటే?

Thursday, January 7th, 2021, 11:32:36 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌ వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించినప్పటికి అది కాస్త వాయిదా పడింది. అయితే కనీసం సంక్రాంతి రోజు ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ఉంటే బాగుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. జనవరి 14 సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.03 గంటలకు ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.