వకీల్ సాబ్ నుంచి మరో అప్డేట్.. ఫ్యాన్స్ బీ రెడీ..!

Monday, March 15th, 2021, 10:00:17 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మగువ మగువ, సత్యమేవ జయతే అనే రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మార్చ్ 17న సాయంత్రం 5 గంటలకు “కంటి పాప” అంటూ సాగే మూడో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించిది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్నట్టు ఇదివరకే ప్రకటించారు.