పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్!

Saturday, August 29th, 2020, 01:20:19 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల సమయం తర్వాత వకీల్ సాబ్ చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల పై అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 కావడం తో అభిమానులు ఇప్పటికే ట్రెండ్ ప్లాన్ చేసి ఉంటారు. అయితే ఇపుడు టీజర్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ సైతం ఇందుకు సంబంధించిన ఒక అప్డేట్ ను పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. అదే రోజున చిత్ర విడుదల కి సంబంధించి అప్డేట్ కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.