వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ పాత్ర అలా ఉండబోతుంది అట!

Thursday, September 10th, 2020, 01:50:02 AM IST


పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయి చాలా రోజులే అవుతుంది. అయినా పింక్ రీమేక్ తో, వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యారు. అయితే లాయర్ పాత్ర లో కనిపించనున్న పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది అనే దాని పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఒక న్యాయవాది గా పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉందనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు అనే దాని పై దర్శకుడు వేణు శ్రీరామ్ పలు వ్యాఖ్యలు చేశారు.

కల్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి అలవాటు పడ్డ నా లాంటి అభిమానులకు ఏం మార్పులు కావాలో, ఆ మార్పులు అన్ని చేసాము అని వేణు శ్రీరామ్ అన్నారు.సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు అని, లెంగ్త్ కూడా ఎక్కువ సేపు ఉంటుంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నట్లు గా ఇందులో పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటుగా యాక్షన్ సన్నివేశాలు కూడా అలరించనున్నాయి.